రాప్తాడు: రాప్తాడులో గొర్రెలు దొంగతనం చేస్తున్న ఇద్దరు నిందితుల అరెస్టు చేసి గొర్రె పిల్లను స్వాధీనం చేసుకున్న రాప్తాడు సిఐ వెంకటే
రాప్తాడు మండల కేంద్రంలో శనివారం నాలుగు గంటల సమయంలో రాప్తాడు సీఐ వెంకటేశులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిఐ వెంకటేశులు మాట్లాడుతూ లింగంపల్లి గ్రామ పరిధిలో ఈనెల రెండో తారీఖున గొర్రె పిల్లలను ఎత్తుకెళ్లడం జరిగింది సాకే సాయి రవికుమార్ రెడ్డి నిందితులను రోజు అరెస్ట్ చేయడం జరిగిందని వారి వద్ద నుంచి ద్విచక్ర వాహనం కారు ఆరు గొర్రెపిల్లలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ప్రధాన నిందితుడు ధనుంజయ్ పరార్ లో ఉన్నాడని ఆ నిందితును కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తామని రాప్తాడు సిఐ వెంకటేషులు మీడియాకు వివరాలను వెల్లడించారు.