నారాయణపేట్: మక్తల్లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు: పాల్గొన్న వాకిటి లలిత
మక్తల్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఈ వేడుకకు హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలిత, లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. నిరుపేదలకు సొంతింటి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.