కనిగిరి: మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి: త్వరలో జరగనున్న కనిగిరి మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి 32 వార్డులు మరియు 42 పోలింగ్ కేంద్రాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి తప్పక హాజరై వార్డులు మరియు పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు.