కనిగిరి: రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమైన కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి మున్సిపాలిటీకి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో కనిగిరి మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కనిగిరి మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన 42 పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను మున్సిపల్ కమిషనర్ కోరారు. అభ్యంతరాలు తమ దృష్టికి తీసుకువస్తే ఎన్నికల సంఘానికి పంపించి, వారి ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలను మార్పు చేయడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు.