కనిగిరి: పట్టణంలో బాలికల బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి లోని బీసీ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గురువారం పరిశీలించారు. పాఠశాలలోని వసతులు మరియు బాలికల రక్షణ కోసం నూతనంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... బాలికల గురుకుల పాఠశాలలో వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడంతోపాటు వారి రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, స్థానిక టిడిపి నాయకులు పాల్గొన్నారు.