కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి
కనిగిరి లోని అమరావతి గ్రౌండ్ నందు ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి లబ్ధిదారులకు శుక్రవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలోని 46 మంది లబ్దిదారులకు రూ.27,23,385 లు లక్షలు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారికి ఎమ్మెల్యే అందజేశారు. ఆపద సమయాల్లో కార్పొరేట్ వైద్యశాలలో వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకునేందుకు సీఎం చంద్రబాబు సీఎంఆర్ఎఫ్ ద్వారా చేయూతను అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు