కనిగిరి: మాచవరంలో మట్టి గణపతులను పూజించాలని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల ర్యాలీ, ఆకట్టుకున్న విద్యార్థుల కోలాట నృత్యాలు
కనిగిరి పట్టణంలోని మాచవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వినాయక చవితి పండుగ నేపథ్యంలో మట్టి గణపతిని పూజించాలని కోరుతూ గ్రామంలో అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మట్టి గణపతిలను పూజించాలని విద్యార్థులు నిర్వహించిన కోలాట నృత్యాలు స్థానికులను విశేషంగా అలరించాయి. కార్యక్రమానికి హాజరైన కనిగిరి ఎస్సై సందీప్ మాట్లాడుతూ... పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.