రాప్తాడు: కనుక పల్లిలో మూడు కోట్ల 40 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో బుధవారం 11:30 గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మూడు కోట్ల 40 లక్షల రూపాయల రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ కనగానపల్లి మండల పరిధిలో ధర్మవరం కళ్యాణ్ దుర్గం రోడ్డు నుంచి వయా ఎల్క్కుంట్ల మీదుగా భద్రపురం గ్రామం వరకు 8 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణానికి మూడు కోట్ల 40 లక్షల రూపాయల నిధులతో చేపట్టబోయే రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభిస్తున్నామని వీలైనంత తొందరగా రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.