కనిగిరి: గణేష్ ఉత్సవాల సందర్భంగా పట్టణంలో సందడి వాతావరణం, ట్రాక్టర్లతో వచ్చి విగ్రహాలను తీసుకువెళ్లిన ఉత్సవ కమిటీ నిర్వాహకులు
మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో గణేష్ ఉత్సవాల సందర్భంగా సందడి వాతావరణం నెలకొంది. సోమవారం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఉత్సవ కమిటీల నిర్వాహకులు ఆదివారం కనిగిరి పట్టణంలోని గణేష్ విగ్రహాల తయారీ కేంద్రాల వద్దకు ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. గణేష్ విగ్రహాలను ట్రాక్టర్లతో మండపాల వద్దకు తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆ ప్రాంగణమంతా సందడి వాతావరణం నెలకొంది.