ఉరవకొండ: పెద్ద కౌకుంట్లలో పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల జరిగే నష్టాలపై అవగాహన నిర్వహించిన డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకట
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదుగవి పెద్ద కౌకుంట్ల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటరమణ ఆధ్వర్యంలో పొగాకు ఉత్పత్తి వినియోగించడం వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ వెంకటరమణ మాట్లాడుతూ పొగాకు వాటి ఉత్పత్తుల వాడకము ద్వారా కలిగే నష్టాల పైన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగిందని పొగాకు వినియోగించడం వల్ల నికోటి పదార్థం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని ప్రజలంతా పొగాకు వాడకానికి దూరంగా ఉండాలని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటరమణ పిలుపునిచ్చారు.