రాప్తాడు: ఎస్కే యూనివర్సిటీలో ఉద్యోగులకు డీఏలు ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని ఎస్కే యూనివర్సిటీ వద్ద సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఎస్కే యూనివర్సిటీ నాన్ టీచింగ్ అధ్యక్షుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ రమేష్ బాబు శ్రీనివాసులు పెద్దన్న మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం కరువు భత్యం డీఎలు ప్రకటించినందుకు కృతజ్ఞతగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తదితర చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని రిజిస్టర్ రమేష్ బాబు, శ్రీనివాసులు, పెద్దన్న పేర్కొన్నారు.