ఉరవకొండ: విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా ఉన్నతస్థాయికి ఎదగాలి
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ శ్రీనివాస విద్యానికేతన్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు కరస్పాండెంట్ శ్రీనివాసులు, హెచ్ ఎం సుమల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్రాంత ఉపాధ్యాయులు పర్వతన్న ,రాంబాబు, నాగరాజు , విజయలక్ష్మిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు పర్వతన్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జీవిత చరిత్ర, విద్యా ప్రాముఖ్యత విద్యార్థుల భవిష్యత్తు ఉన్నతికి అవసరమైన అంశాలను విద్యార్థులకు చక్కగా వివరించారు. విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని ఆదర్శంగా తీసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు.