రాప్తాడు: రాప్తాడు మండలంలో వర్షాభావం వల్ల ఎండిపోయిన వేరుశనగ కంది చీని పంటలను పరిశీలించిన సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో శనివారం 11:30 నుంచి రెండున్నర గంటల వరకు రాప్తాడు మండలంలో ఎండిపోయిన చీని వేరుశనగ కంది పంట పొలాలను సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు వల్ల రైతులు వేసిన వేరుశనగ కండి చీని తోటలు పూర్తిగా ఎండిపోవడం జరిగిందని అనేకమంది రైతులు గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు వలసలు పోతున్నారని ఈ సమస్యను ముఖ్యమంత్రి వెంటనే పరిష్కరించాలని ఈ నెల 15న ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కరువు పరిస్థితుల గురించి వివరిస్తామని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు.