కనిగిరి: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో వైసిపికి ప్రతిపక్ష స్థానం లేకుండా పోయింది: కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి: గత వైసిపి ప్రభుత్వం లో టిడిపి అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్టయి మూడేళ్లు పూర్తయిన నేపథ్యంలో, 53 రోజుల ఆయన నిర్బంధానికి నిరసనగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టిడిపి శ్రేణులతో కలిసి 53 కవ్వొత్తులను బుధవారం టిడిపి కార్యాలయంలో వెలిగించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... చంద్రబాబు అరెస్టుతో ప్రజల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చి వైసిపికి ప్రతిపక్ష స్థానం లేకుండా చేశారని ఎమ్మెల్యే అన్నారు.