కనిగిరి: స్థానిక ఎన్నికల్లో ఎవరికి సీటు వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలి: కనిగిరి వైసీపీ ఇంచార్జ్ నారాయణ యాదవ్
కనిగిరి: స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు ఆశించేవారు ఎక్కువ ఉంటారని, అయితే మున్సిపల్ చైర్మన్ అయినా, ఎంపీపీ అయినా ఒకరే ఉంటారని ఎవరికి సీటు వచ్చినా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దల నారాయణ యాదవ్ శనివారం కార్యకర్తలకు సూచించారు. ఎమ్మెల్యే సీటైనా అది కేవలం నెంబర్ మాత్రమేనని, ముఖ్యంగా కార్యకర్త, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీలో కీలకమని నారాయణ యాదవ్ అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరం సమన్వయంతో పనిచేసి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుందామని ఆయన పార్టీ శ్రేణులను కోరారు.