రాప్తాడు: చిన్మయ నగర్ జెఎన్టియులో జనాభా గణన 2027 రెండో విడత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అనంతపురం జిల్లా రెవిన్యూ అధికారి మలోల
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయి నగర్ జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల 45 నిమిషాల సమయంలో జిల్లా రెవిన్యూ అధికారి మనలోల 2027 జనాభా గణన రెండో విడత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మలోల మాట్లాడుతూ జనాభా గణన 2027 అవగాహన శిక్షణ కార్యక్రమంలో క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులు మొబైల్ యాప్ పై అవగాహన కలిగి ఉంది ప్రజల నుండి సమాచారం సేకరించే సమయంలో ఓర్పుగా సహనముతో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని వివరాలను వివరించి వారి వద్ద నుంచి సమాచారాన్ని సేకరించాలని అనంతపురం జిల్లా రెవిన్యూ అధికారి మలోల పేర్కొన్నారు.