ఉరవకొండ: విద్యుత్ సరఫరాసమస్యలుపై రైతులు స్థానిక సబ్‌స్టేషన్‌కు చేరుకుని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు
అనంతపురం జిల్లా ఉరవకొండలో విద్యుత్ సరఫరా సమస్యలపై రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. స్థానిక సబ్‌స్టేషన్‌కు చేరుకుని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. పగటిపూట ఒకేసారి ఆరు గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక పంటలు సాగు చేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.