కనిగిరి: గణేష్ నిమజ్జోత్సవాలకు రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో కలిసి చెరువులను పరిశీలించిన కనిగిరి సీఐ శ్రీనివాసరావు
గణేష్ ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు శనివారం కనిగిరి మండలంలోని పలు చెరువులను కనిగిరి సీఐ ఉప్పు శ్రీనివాసరావు రెవిన్యూ మరియు విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కనిగిరి మండలంలోని పునుగోడు, ఎన్ గొల్లపల్లి గ్రామాలలోని చెరువులను సీఐ పరిశీలించారు. గణేష్ నిమజ్జనం ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువుల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కనిగిరి ఎస్సై సందీప్ ను సీఐ శ్రీనివాసరావు ఆదేశించారు.