కనిగిరి: టిడ్కో ఇళ్లను మూడు దశల్లో లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి మండలం చాకిరాల వద్ద నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహసముదాయాలను అధికారులతో కలిసి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... టిడ్కో ఇళ్ల ను అన్ని వసతులతో త్వరలో పూర్తిచేసి లబ్ధిదారులకు అందుబాటులో తీసుకురావాలన్నారు. మూడు దశలో లబ్ధిదారులకు ఇళ్లను అందజేయడం జరుగుతుందని, మొదటి విడతగా దీపావళి నాటికి క్లబ్ధిదారులకు కొన్ని ఇళ్లను ఇస్తామని, సంక్రాంతి లోపు మిగతా రెండు విడతల్లో లబ్ధిదారులకు ఇళ్లను అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.