నారాయణపేట్: మక్తల్: 2.50 కోట్లతో బీటీ రోడ్డు కం బ్రిడ్జి ప్రారంభం
మక్తల్ పట్టణం 3వ వార్డులో 2.50 కోట్ల రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్డు కం బ్రిడ్జిని మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ప్రజల రవాణా సౌకర్యం కోసం ఈ పనులను ప్రభుత్వం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.