రాప్తాడు: మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై గోపాల్ రెడ్డి విమర్శించడం మానుకో అనంతపురంలో రూరల్ వైయస్సార్ మండల కన్వీనర్ బండి పవన్
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి నివాసంలో ఆదివారం ఐదున్నర గంటల సమయంలో రూరల్ వైయస్సార్ పార్టీ మండల కన్వీనర్ బండి పవన్ ఇతర వైసీపీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బండి పవన్ మాట్లాడుతూ గోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పై అసత్య ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని ఈరోజు వైసీపీ పార్టీలో పదవులు వచ్చాయంటే ప్రకాష్ రెడ్డి సహకారం లేకుండా పదవులు వచ్చాయా గతాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలని ప్రకాష్ రెడ్డి విమర్శించడం మానుకుంటే మంచిదని మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గోపాల్ రెడ్డి పై వైసీపీ రూరల్ మండల నాయకులు బండి పవన్ విమర్శించారు.