కనిగిరి: పామూరు: కారులో కాలిపోయిన వ్యక్తి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కనిగిరి DSP
పామూరు- మాలకొండ జాతీయ రహదారిపై లింగన్నపాలెం జంక్షన్ వద్ద కారు దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి పూర్తిగా కాలిపోయి మృతి చెందాడు. కేసు దర్యాప్తులో భాగంగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ సాయంతో పాటు టోల్ ప్లాజా సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నామని కనిగిరి DSP తెలిపారు.