ఉరవకొండ: విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని బెళుగుప్ప విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నక్కలపల్లి గ్రామ రైతులు ఆందోళన
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం సాయంత్రం నక్కలపల్లి గ్రామ రైతులు విద్యుత్ సరఫరా లో సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు. వర్షాభావం పరిస్థితుల సమయాల్లో వ్యవసాయ తోటలో సాగు చేసిన పంటలకు విద్యుత్ కోతలు లో వోల్టేజ్ సమస్యల మూలంగా నీటిని అందించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు వాపోయారు. విద్యుత్ సబ్స్టేషన్లో ఎంవీ ట్రాన్స్ఫార్మర్ల సమర్థ్యాన్ని పెంచి 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఆందోళన చేపట్టారు.