నారాయణపేట్: నారాయణపేట: పోలీసు సిబ్బందికి వ్యాసరచన పోటీలు - అదనపు ఎస్పీ వెల్లడి
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లాలో పోలీసు అధికారులకు, సిబ్బందికి వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల బాధ్యతలు, సామాజిక అంశాలపై ఈ పోటీలు జరుగుతున్నాయి. విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నట్లు అదనపు ఎస్పీ రియాజ్ ఉల్ హక్ తెలిపారు.