రాప్తాడు: అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతు రుణాలు మాఫీ చేయాలి అనంతపురంలో రాప్తాడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లి
అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం 11 గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు నియోజకవర్గం రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీవో కార్యాలయం వద్ద రైతు సమస్యలపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ అనంతపురం జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి రైతులు పంటల కోసం చేసిన రుణాలన్నిటిని రుణమాఫీ చేయాలని రైతులను ఆదుకోవాలని ఈ సమస్యల పైన రైతులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని లేకుంటే పెద్ద ఎత్తున రైతులను కలుపుకొని పోరాటాలు చేస్తామని రాప్తాడు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మల్లికార్జున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.