ఉరవకొండ: రైతు సమస్యల పై ఆ ఇద్దరూ ఒకే చోట
ఒకరు మాజీ ఎంపీ తలారి రంగయ్య కాగా .
మరొకరు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు
రైతుల సమస్య పై ఆ ఇద్దరూ ఒకే చోట ఒకరు మాజీ ఎంపీ తలారి రంగయ్య కాగా . మరొకరు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని హనుమరెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం రైతుల సమస్య పరిష్కరించాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య బైఠాయించారు. కొద్దిసేపటికే చేరుకున్న ఎమ్మెల్యే అమిలినేని సమస్యను విని అధికారులతో మాట్లాడి సమస్య సకాలంలో పరిష్కరిస్తాం అని అక్కడికక్కడే జిల్లా వంతె అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అమలినేని సురేంద్రబాబు పేర్కొనడంతో సమస్య సద్దుమణిగింది.