నారాయణపేట్: మక్తల్: 229 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.. రూ. 89 లక్షల ఆర్థిక సాయం
మక్తల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో 229 మంది లబ్ధిదారులకు రూ. 88,97,890 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి పేర్కొన్నారు.