కనిగిరి: పట్టణానికి చెందిన విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద స్థితిలో మృతి, తన కుమారుడిది హత్యే నని పోరాడి తల్లి ఆత్మహత్య
సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్లో ఫిబ్రవరి 14న కనిగిరికి చెందిన విద్యార్థి తౌషిక్ (11) అనుమానాస్పదంగా మృతి చెందాడు. తన కుమారుడిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ కోచింగ్ గత కొన్ని నెలలుగా తౌషిక్ తల్లి మౌలాభి న్యాయం చేయాలని ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. గురువారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ఒంగోలుకు తరలించి చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో కుటుంబ సభ్యులు హైదరాబాదుకు ఆమెను తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందింది. మౌలాబి మృతితో కనిగిరిలో విషాదఛాయలు అలముకున్నాయి.