నారాయణపేట్: SGF అండర్-14 చెస్ పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన జాజాపూర్ విద్యార్థిని కే. మానస
నారాయణపేటలో జరిగిన 70వ SGF అండర్-14 బాలికల జిల్లాస్థాయి చదరంగం పోటీల్లో జాజాపూర్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కే. మానస ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని, ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమెను ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.