కనిగిరి: మిట్టపాలెం శ్రీ నారాయణస్వామి ఆలయంలోవర్షాలు కురవాలని వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా వరుణ యాగం
చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెం గ్రామంలో కొలువైన శ్రీ నారాయణ స్వామి వారి సన్నిధిలో పేద పండితుల ఆధ్వర్యంలో వరుణ యాగాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఎల్ నినో ప్రభావంతో కనిగిరి నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందాలని కోరుతూ శ్రీ నారాయణ స్వామి సన్నిధిలో పండితులు వరుణ యాగం నిర్వహించారు. వర్షాలు కురిసి ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని యాగం నిర్వహించినట్లు పండితులు తెలిపారు.