రాప్తాడు: అనంతపురంలో రాప్తాడు లో గాయపడిన విద్యార్థిని లక్ష్మికి మూడు లక్షల రూపాయలు చెక్కు పంపిణీ చేసిన రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్ర
అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల 45 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో గాయపడిన విద్యార్థి లక్ష్మీను పరామర్శించి వైయస్సార్ పార్టీ తరఫున మూడు లక్షల రూపాయలు చెక్రు అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాప్తాడులో గాయపడిన విద్యార్థిని లక్ష్మికి మూడు లక్షల రూపాయలు వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆర్థిక సహాకారం అందించడం జరిగిందని బెంగళూరులో ఉన్న గోపిక కూడా 5 లక్షల రూపాయలు చెక్కును రేపు అందజేయబోతున్నామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పాల్గొన్నారు.