రాప్తాడు: చిన్మయ నగర్ JNTU లో ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని ప్రారంభించిన VC సుదర్శన్ రావు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో జేఎన్టీయూ కస్తూరిబా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత ఫిజియోథెరపీ శిబిరాన్ని ఉపకళపతి సుదర్శన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా కస్తూర్బా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సహకారంతో ఉచిత ఫిజియోథెరపీ శిబిరం ద్వారా ఎందరికో సేవలు అందించడం జరిగిందని ఫిజియోథెరపీ మందులు వాడకుండా నొప్పులు తగ్గించే సులభమైన మార్గమని దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జెఎన్టియు ఉపకులపతి ప్రొఫెసర్ హెచ్ సుదర్శన్ రావు పేర్కొన్నారు.