ఉరవకొండ: చిన్న ముస్తూరు గ్రామంలో ఎన్నికల నిబంధనలు పాటించాల్సిన నియమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించిన అర్బన్ ఎస్సై జనార్ధన్
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం ఉరవకొండ మండలంలోని చిన్న ముష్టురు గ్రామంలో బుధవారం ఏడున్నర గంటల సమయంలో అర్బన్ ఎస్సై జనార్ధన్ తన సిబ్బందితో కలిసి ఎన్నికల నిబంధనల గురించి స్థానిక గ్రామస్తులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్సై జనార్దన్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సమయంలో పాటించాల్సిన నియమాలు చేయకూడని పనులు శాంతి భద్రతలకు వికాసం కలిగించకుండా ప్రజలంతా సహకారం అందించాలని ఎవరే గాని గొడవలు సృష్టించుకోకూడదని ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఉరవకొండ అర్బన్ ఎస్సై జనార్ధన్ ప్రజలను కోరడం జరిగింది,ఈ కార్యక్రమంలో అర్బన్ పోలీస్ సిబ్బంది స్థానిక గ్రామస్తులు పాల్గొన్నారు.