ఉరవకొండ: హనుమరెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద రైతులతో కలసి మాజీ ఎంపీ తలారి రంగయ్య రోడ్డుపై బైఠాటాయింపు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని హనుమరెడ్డిపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద అనంతపురం కళ్యాణదుర్గం మధ్య ప్రధాన రహదారిపై రైతులతో కలిసి మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య బైఠాయించారు. రైతులకు సకాలంలో, నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న రైతులకు తక్షణమే న్యాయం చేయాలని మాజీ ఎంపీ డిమాండ్ చేసారు. దీంతో వాహనాలు రోడ్డు పై ఆగిపోయాయి.