నారాయణపేట్: నారాయణపేటను కరువు జిల్లాగా ప్రకటించాలి: మల్ రెడ్డి పల్లి రైతుల డిమాండ్
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్ రెడ్డి పల్లిలో ఎండిపోయిన పంటలను సిపిఎం బృందం పరిశీలించింది. జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, ఎకరానికి 25 వేల పరిహారం ఇవ్వాలని, రుణాలను రీ షెడ్యూల్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.