రాప్తాడు: మనీలా గ్రామంలో వేరుశనగ పంట పొలాలను పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మనీలా గ్రామంలో ఆదివారం 12 గంటల 15 నిమిషాల సమయంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి నల్లప్ప కార్యవర్గ సభ్యుడు బాల రంగయ్య రాప్తాడు రూరల్ మండల కార్యదర్శి రామాంజనేయులు వేరుశనగ పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప బాల రంగయ్య రామాంజనేయులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు ఎకరాకు 30000 పైగా ఖర్చు చేసి సాగు చేయడం జరిగిందని ఇప్పటికైనా ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి నల్లప్ప రామాంజనేయులు బాల రంగయ్య డిమాండ్ చేశారు.