ఉరవకొండ: వరణుడి కరుణ కోసం ఏడు గ్రామాల మీదుగా అఖండ భజన చేసిన నక్కలపల్లి గ్రామ రైతులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం నక్కలపల్లి గ్రామ రైతులు ప్రజలు కలసి వరుణుడి కరుణ కోసం ఏడు గ్రామాల మీదుగా అఖండ భజనలు చేస్తూ పాదయాత్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. తొలితగా నక్కలపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో భజనలు ప్రారంభించి పాదయాత్ర చేస్తూ గుండ్లపల్లి శ్రీరంగాపురం కల్వకుర్తి హనకన హాల్ బెలుగుప్ప మీదుగా తిరిగి నక్కలపల్లికి చేరుకుని పాదయాత్ర ముగించారు. ఏడు గ్రామాలలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాల్లో పూజలు నిర్వహించి వరుణుడి కరుణ కోసం ప్రార్థించామని నక్కలపల్లి గ్రామ రైతులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.