ఉరవకొండ: నూతన వైకుంఠ రథాన్ని బెలుగుప్ప గ్రామ పంచాయతీకి పయ్యావుల సోదరుల సహకారంతో అందించిన టిడిపి మండల నాయకులు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం టిడిపి నాయకులు అధికారుల సమక్షంలో బెళుగుప్ప గ్రామపంచాయతీకి నూతన వైకుంఠ రథాన్ని వితరణ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, సోదరులు పయ్యావుల శీనప్పల ఆధ్వర్యంలో కీర్తిశేషులు పయ్యావుల ఓబులమ్మ, పయ్యావుల వెంకటనారాయణప్పల జ్ఞాపకార్థం గ్రామానికి వైకుంఠ రథాన్ని సమకూర్చారన్నారు. నూతన వైకుంఠ రథాన్ని ఫ్రీజర్ను టీడీపీ మండల నాయకులు మల్లికార్జున పెద్దతిప్పయ్యలు కన్వీనర్ సునీల్ తో కలసి తహసిల్దార్ అనిల్ కుమార్, ఎంపీడీవో లక్ష్మీనారాయణ, పంచాయతీ కార్యదర్శి మంజునాలకు తాళాలు అందజేశారు