నారాయణపేట్: గణేష్ ఉత్సవాల వేళ పోలీసుల కీలక హెచ్చరికలు: డీజేలకు అనుమతి లేదు!
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మరికల్ సీఐ భగవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు. ఉత్సవాల్లో డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆన్లైన్లో మండపాల వివరాలు నమోదు చేయాలని, శాంతియుతంగా పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.