నారాయణపేట్: మక్తల్ లో 76 వేల ఓట్ల తొలగింపుపై మంత్రి వాకిటి శ్రీహరి కీలక సమీక్ష
మక్తల్ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపుపై మంత్రి వాకిటి శ్రీహరి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 36 వేల ఓట్లు తొలగించగా, తాజాగా 76 వేల ఓట్ల తొలగింపునకు నోటీసులు వచ్చాయని తెలిపారు. అర్హులైన పేదవారి ఓట్లు పోకుండా బూత్ స్థాయిలో కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.