నారాయణపేట్: జాజాపూర్ పాఠశాల పీడీ నర్సింలు గారికి ఘన సన్మానం
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన నారాయణపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జాజాపూర్ పీడీ నర్సింలు గారిని ప్రధానోపాధ్యాయురాలు భారతి గారు శాలువాతో సత్కరించారు. విద్యార్థులను క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్న నర్సింలు గారి కృషికి ఈ అవార్డు లభించింది.