ఉరవకొండ: వజ్రకరూరులో ఘనంగా వైయస్సార్ వర్ధంతి కార్యక్రమం
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి 17 వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం స్థానిక వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద నిర్వహించారు. వైయస్సార్సీపి పిఎసి సభ్యులు విశ్వేశ్వర్ రెడ్డి ఆదేశాలతో పార్టీ మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి అధ్యక్షతన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వైస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్సార్సీపీ ప్రజాప్రతినిదులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు నాయకులు పాల్గొన్నారు.