ఉరవకొండ: విడపనకల్లు మండలంలో జిబిసి (గుంతకల్లు బ్రాంచ్ కెనాల్) కి పలు చోట్ల రంద్రాలు ఏర్పడి నీరు వృథా
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలో జిబిసి (గుంతకల్లు బ్రాంచ్ కెనాల్) కి పలు చోట్ల రంద్రాలు ఏర్పడి నీరు వృథాగా పోతోంది. కాలువ నుంచి గత రెండు రోజులుగా భారీగా నీరు బయటకు వస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఈ వృథా మరింత నష్టం కలిగిస్తోందని శనివారం రైతులు వాపోయారు.. అధికారులు వెంటనే స్పందించి రంధ్రాన్ని పూడ్చి నీటి వృథాను అరికట్టాలని రైతులు కోరుతున్నారు.