ఉరవకొండ: కేజీబీవీ పాఠశాలలోని పదవ తరగతిలో 100% ఉత్తీర్ణతతో ప్రతి విద్యార్థిని ఉత్తమ మార్కులు సాధించాలి: బెలుగుప్ప ఎంపీపీ పెద్దన్న
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలను బెలుగుప్ప మండల ఎంపీపీ పెద్దన్న, తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మల్లికార్జునతో కలసి బుధవారం పరిశీలించారు. తన పదవీకాలం ముగియడంతో చివరి రోజైన బుధవారం పాఠశాల ఎస్ ఓ నాగరత్నతో కలిసి పదవ తరగతి విద్యార్థినిల తరగతి గదికి వెళ్లిన ఎంపీపీ విద్యార్థినులకు పలు సలహాలు సూచనలను తెలియజేశారు. ప్రతి విద్యార్థి పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి 100% ఉత్తీర్ణత నమోదు కావడంతో పాటు అత్యుత్తమ మార్కులను ప్రత్యేక ప్రణాళికాబద్ధంగా చదివి మార్కులను సాధించి ఆదర్శంగా నిలిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఎంపీపీ మరియు టిడిపి జిల్లా నాయకులు సూచించారు.