రాయదుర్గం: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి : వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి
రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ వైసిపి కార్యకర్త పనిచేయాలని వైసిపి నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం రాయదుర్గంలో ఎన్నికల సన్నాహక సమావేశాన్ని ఆయన నిర్వహించారు. రెండున్నర ఏళ్లులో అధికార చేసిన పార్టీ దౌర్జన్యాలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. అన్ని చోట్లా గెలుపొందేలా కృషి చేయాలని కోరారు. ఎస్ఈసి మెంబర్ గౌని ఉపేంద్రారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉషారాణి, జెడ్పిటిసి పద్మావతి, మల్లికార్జున బూత్ కమిటీ ల కన్వీనర్ అంజిరెడ్డి, మండల కన్వీనర్ లు మేకల శ్రీనివాస్ పాల్గొన్నారు.