రోడ్డు భద్రతా నియమాలు ఉల్లంఘించిన 14 మంది ద్విచక్ర వాహనదారులకు ఎంవిఐ కేసులు నమోదు చేసి జరిమానాలు విధించినట్లు డి.హిరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తెలిపారు. గురువారం రాత్రి జాజిరకల్లు టోల్ గేట్ సమీపంలో వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్లకు డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం త్రాగి ఇద్దరు వ్యక్తులపైన, మద్యం సేవించి వాహనం నడుపుతున్న మరో వ్యక్తి పైన కూడా కేసు నమోదు చేశామన్నారు.