దీర్గ కాలిక సమస్యల పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ సహకార ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఈదృతమవుతోంది. సమ్మెలో భాగంగా రాయదుర్గం పట్టణంలో ఉద్యోగులు శుక్రవారం ధర్నా చేపట్టారు. జీఓ 36 అమలు చేయాలని, వేతన సవరణ చేపట్టాలని, రిటైర్మెంట్ 62 ఏళ్లకు పెంచాలని జెఏసి ఆధ్వర్యంలో ఈనెల 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టినట్లు జేఏసీ నేతలు తెలిపారు. ప్రభుత్వం మెండి వైఖరి విడనాడి సమస్యలు పరిష్కరించాలని కోరారు.