కనిగిరి: పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో గుర్రం జాషువా జయంతి, జాషువా విగ్రహానికి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి:మహాకవి, నవయుగ వైతాళికుడు గుర్రం జాషువా జయంతి వేడుకలను కనిగిరి పట్టణంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం ప్రాంగణంలో ఉన్న గుర్రం జాషువా విగ్రహానికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలోని అసమానతలపై తన సాహిత్యం ద్వారా పోరాడిన మహనీయుడు జాషువా అని, ఆయన రచనలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.