రాయదుర్గం: పట్టణంలోని ఓంశాంతి మందిరంలో భక్తిశ్రద్దలతో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు
రాయదుర్గం పట్టణంలోని ఓంశాంతి మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికలు, రాధా వేషధారణలో చేసిన నృత్య ప్రదర్శనలు, భజనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ముందుగా ఓంశాంతి మందిరం సంచాలకులు బీకే యోగేశ్వరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్నుడని, 16 కళల సంపూర్ణుడని, మర్యాద పురుషోత్తముడని, ధర్మ సంస్థాపన, అధర్మ వినాశనం కోసం అవతరించిన దివ్య పురుషుడని వివరించారు. కృష్ణుడి బోధనలు నేటి సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు.