రాయదుర్గం: బాల్యవివాహాలు వద్దు : రాయదుర్గం సిఐ దేవానంద్
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18 ఏళ్ల లోపు బాలికలకు వివాహం చేయడం వల్ల చదువు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని రాయదుర్గం సిఐ దేవానంద్ అన్నారు. తహసీల్దార్ సూర్యప్రతాప్, సిడిపిఓ లక్ష్మీ ప్రసన్న తో కలసి సంయుక్తంగా మంగళవారం పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ లో బాల్య వివాహాలు, మహిళల చట్టాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలకు పాల్పడితే తల్లిదండ్రులు, పెళ్లి చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ హెచ్చరించారు. ఏదైనా సమస్య ఉంటే భయపడకుండా 100 డయల్, 1098 చైల్డ్ లైన్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.